తీర రాష్ట్రమైన గోవాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోవా-కర్ణాటక సరిహద్దులోని పర్యాటక ప్రాంతమైన దూద్‌సాగర్ జలపాతం వద్ద పెనుప్రమాదం తప్పింది.
ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. భారతదేశం 121 దేశాలతో విడుదల చేసిన జాబితాలో 2021లో 101 స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 107వ స్థానానికి పడిపోయింది.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల ముల్తాన్‌లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్‌లోని నిస్తార్ ఆస్పత్రిలో సుమారు 200 మృతదేహాలు మార్చురీ పైకప్పుపై కుళ్లిన స్థితిలో బయటపడడం కలవరం రేపింది.
హిందూ వివాహాలపై ఉత్తరప్రదేశ్ ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ చేసిన వివాదాస్పద వ్యాఖ్య సంచలనం రేపింది. రాష్ట్రంలో ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
ప్రత్యక్ష సాక్షుల రూపంలో ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే హత్యాయుధం రికవరీ చేయనప్పటికీ, హత్య కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
వివాహాన్ని రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తమ అధికారాన్ని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
సాధారణంగా అందాల పోటీల్లో గెలిచిన వారికి అందాల కిరీటం, బిరుదులు, షీల్డులు, నగదు బహుమతులు ఇస్తుంటారు. కానీ పంజాబ్‌లోని బటిండాలో అందాల పోటీ ప్రకటన చూసి అందరూ అవాక్కయ్యారు.
ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి 25 మంది మృతి చెందారు. చాలా మంది భూగర్భంలో చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.