Supreme Court: వివాహాన్ని రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తమ అధికారాన్ని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇద్దరి అంగీకారం లేకుండా విడాకులు ఇవ్వడం కుదరదని చెప్పింది. పెళ్లి అయిన తర్వాత 40 రోజులు మాత్రమే కలిసి ఉండి.. రెండేళ్లుగా వేరుంటున్న తన భార్యకు విడాకులు మంజూరు చేయాలని భర్త దాఖలు చేసిన అప్పీల్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది.
దంపతులు కేవలం 40 రోజులు మాత్రమే కలిసి ఉన్నారని, దాదాపు రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దేశంలో వివాహ వ్యవస్థ అనేది ఓ సాధారణ విషయం కాదని, ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు తీసుకుంటుమనే పాశ్చాత్య సంస్కృతికి మనమింకా చేరుకోలేదని వ్యాఖ్యానించింది. విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ భర్త అభ్యర్థనను తోసిపుచ్చింది. దంపతులు ఉన్నత విద్యావంతులని.. భర్త ఒక ఎన్‌జీవోను నడుపుతున్నారని, భార్యకు కెనడాలో శాశ్వత నివాసం అనుమతి ఉందని.. విభేదాలను పరిష్కరించుకోవడానికి దంపతులు కృషి చేయాలని ధర్మాసనం పేర్కొంది.
ఆ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు కెనడాలో ఉన్నవన్నీ విడిచిపెట్టానని, అయితే వివాహాన్ని రద్దు చేసుకోవాలని భర్త ఆదేశిస్తూ పట్టుబట్టడంతో భార్య ఉన్నత న్యాయస్థానానికి తెలియజేసింది.తన వివాహాన్ని కాపాడాలంటూ ఓ భార్య దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. భర్త దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరింది తాను కెనడాలో పనిచేస్తున్నానని, తన భర్త కోసం కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో భారత్‌కు వచ్చానని భార్య తెలిపింది.
Beauty Contest: అందాల పోటీల్లో విజేతకు బహుమతిగా ఎన్నారై వరుడు.. పోస్టర్లు వైరల్
తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జీవించాలని భావిస్తున్నానని, అయితే అతని భార్య కెనడియన్ దృక్పథాన్ని కలిగి ఉందని, తల్లిదండ్రులతో కలిసి జీవించకూడదని పట్టుబట్టినట్లు భర్త కోర్టుకు వివరించారు. ఇరువురు అంగీకరిస్తేనే విడాకులు మంజూరు చేస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. మధ్యవర్తిత్వ విచారణకు వెళ్లాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం దంపతులను కోరింది. పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమించింది. వివాహ సలహాదారుని సహాయం తీసుకోవడానికి అనుమతించింది. ఈ విషయంలో మూడు నెలల్లో నివేదికను కోరింది.