Mine Blast in Turkey: టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ పేలుడు.. 25 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mine Blast in Turkey: ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి 25 మంది మృతి చెందారు. చాలా మంది భూగర్భంలో చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గడిచిన 11 ఏళ్లలో టర్కీలో జరిగిన అత్యంత ఘోర పారిశ్రామిక ప్రమాదాలలో ఇది ఒకటని ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా వెల్లడించారు. సజీవంగా బయటకు తీసిన మరో 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ట్వీట్ చేశారు. తాము విచారకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయ్లు అన్నారు.
మొత్తం 110 మంది భూగర్భంలో పనిచేస్తున్నారని, వారిలో కొందరు తమంతట తాముగా బయటకు రాగా.. మరికొందరిని అధికారులు రక్షించారని మంత్రి సోయ్లు తెలిపారు. దాదాపు 50 మంది మైనర్లు 2 వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్నారని అంతర్గత మంత్రి తెలిపారు.వారు భూగర్భంలో 300, 350 మీటర్ల మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్నారని సోయ్లీ ముందస్తు నివేదికలను ధ్రువీకరించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటానని చెప్పారు. ప్రాణనష్టం పెరగకూడదని, మైనర్లు సజీవంగా దొరుకుతారని తాము ఆశిస్తున్నామని ఎర్డోగాన్ పేర్కొన్నారు.
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?
సూర్యాస్తమయానికి కొద్ది క్షణాల ముందు పేలుడు సంభవించింది. చీకటి కారణంగా రెస్క్యూ ప్రయత్నానికి ఆటంకం ఏర్పడింది. టర్కీకి చెందిన మాడెన్ ఈజ్ మైనింగ్ వర్కర్స్ యూనియన్ పేలుడుకు మీథేన్ గ్యాస్ ఏర్పడటమే కారణమని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై కచ్చితమైన నిర్ధారణకు రావడం అకాలమని ఇతర అధికారులు తెలిపారు. వారిని కాపాడేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి సహాయకులతో పాటు బలగాలు అక్కడ చర్యలు చేపట్టాయి. 70 మందికి పైగా రక్షకుల బృందం 250 మీటర్ల దిగువన ఉన్న గొయ్యిలో ఒక ప్రదేశానికి చేరుకోగలిగిందని స్థానిక గవర్నర్ చెప్పారు. స్థానిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ సంఘటనను ప్రమాదంగా పరిగణిస్తున్నట్లు, అధికారిక దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 2014లో టర్కీలోని పశ్చిమ పట్టణమైన సోమాలో జరిగిన పేలుడులో 301 మంది కార్మికులు మరణించారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!