చాలా మంది కుబేరులు ఎంత సంపాదించినా సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు చేయాలని భావిస్తుంటారు. దేశంలో కొందరు ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు తమ సహృదయాన్ని, దానగుణాన్ని చాటుకుంటున్నారు. దాతృత్వంలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వరుసలో ముందు నిలిచారు ఐటీ టైకూన్ శివ్ నాడార్.
రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇది భారత రాజ్యాంగంలోని విలువలకు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
గర్భాశయ క్యాన్సర్ చికిత్స కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్ సెర్వవాక్ ఉత్పత్తిని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఓ బాంక్వెట్ హాల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక శాఖ అధికారులకు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సెక్టార్-3లోని ఘటనాస్థలికి చేరుకున్నారు.
మిళనాడులోని ఓ రిసార్ట్‌లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి ముగ్గురు మృతి చెందారు. చెన్నైకి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్‌లో ఈ రిసార్ట్ ఉంది.
పాక్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు రాజకీయగా చుక్కెదురైంది. తోషాఖానా కేసులో ఆయనపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కానుకల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాచిపెట్టిన కేసులో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
క్షిపణి ప్రయోగాల్లో భారత్ దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ ఇవాళ 09.45గంటలకు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ బీజేపీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథురాం గాడ్సేను ఆరాధించే వ్యక్తులను ముస్లింలు ఎన్నటికీ విశ్వసించలేరు కాబట్టి ముస్లింలు బీజేపీకి ఎన్నటికీ ఓటు వేయరని ఆయన అన్నారు.
బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నికుంటారని ఆమె ప్రకటించడంతో తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆమె ఈ విషయాన్ని ప్రకటించడంతో అందరి చూపు తాజాగా ఎన్నికల్లో ఓటమి పాలైన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై పడింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి మరోసారి మద్దతుగా నిలిచారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలతోనే సౌరభ్ గంగూలీని ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.