Rishi Sunak: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. అందరి చూపు రిషి సునాక్ వైపే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak: బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నికుంటారని ఆమె ప్రకటించడంతో తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆమె ఈ విషయాన్ని ప్రకటించడంతో అందరి చూపు తాజాగా ఎన్నికల్లో ఓటమి పాలైన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై పడింది. బ్రిటన్‌లో ఆర్థిక మాంద్యం తలెత్తతుందన్న ఆందోళనల నేపథ్యంలో తాను పదవిని నిర్వర్తించే పరిస్థితి లేక రాజీనామా చేస్తున్నట్లు లిజ్ ట్రస్ ప్రకటించారు. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజుకు తెలియపరిచానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొనసాగనున్నట్టు తెలిపారు. మినీ బడ్జెట్‌తో తీవ్ర విమర్శలపాలైన ట్రస్.. తన వాగ్దానం నిలబెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం, ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పడంతో లిజ్ ట్రస్ పదవి నుంచి తప్పుకున్నారు. తద్వారా బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తిగా లిజ్ ట్రస్ రికార్డుల్లోకెక్కారు. మినీ బడ్జెట్‌తో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని కూడా తప్పుకోవడం కలకలం రేపింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
యూకే ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో రిషి సునాక్‌పై విజయం సాధించిన లిజ్‌ట్రస్ సెప్టెంబర్ 5న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లిజ్ ట్రస్. ప్రధానమంత్రి హోదాలో ఎంపీల ప్రశ్నలకు జవాబివ్వడానికి ట్రస్ బుధవారం పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇటీవల లిజ్‌ట్రస్ ప్రకటించిన మినీ బడ్జెట్ ఆ దేశంలో మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మరింత గందరగోళానికి గురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, లిజ్‌పై ఒత్తిడికి కారణమైంది. మార్కెట్లు కుప్పకూలడం, పౌండ్ విలువ పతనం గందరగోళానికి దారితీసింది. అయితే, ఈరోజు ఆమె రాజీనామా ప్రకటించడంతో చోటుచేసుకున్న పరిణామాల వేళ పౌండ్ విలువ 0.36శాతం పెరిగినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
Liz Truss Resign: యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. అక్కడ మళ్లీ రాజకీయ సంక్షోభం
కన్జర్వేటివ్ పార్టీ నేత జెర్మీ హంట్ తాను ప్రధాని రేసులో లేనని ప్రకటించడంతో తదుపరి ప్రధానిగా ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ప్రధానంగా రిషి సునాక్ పేరు వినిపిస్తోంది. లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత ప్రధానంగా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో రిషి సునాక్ పేరు ముందు వరుసలో ఉండగా.. ఆ తర్వాత పెన్నీ మోర్డాంట్, బెన్ వాల్స్, టామ్ తుగెందాట్‌లతో పాటు బోరిస్ జాన్సన్ పేరు కూడా వినిపిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతోనే లిజ్‌ట్రస్ తదుపరి ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అలాగే, బ్రిటన్ హోంసెక్రటరీ పదవికి నిన్న రాజీనామా చేసిన సుయెల్లా బ్రేవర్మన్ పేరు కూడా ప్రచారంలో ఉన్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?