Iqbal Mehmood: సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ బీజేపీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథురాం గాడ్సేను ఆరాధించే వ్యక్తులను ముస్లింలు ఎన్నటికీ విశ్వసించలేరు కాబట్టి ముస్లింలు బీజేపీకి ఎన్నటికీ ఓటు వేయరని ఆయన అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) బీజేపీకి ‘బీ టీమ్’ అని కూడా ఆయన ఆరోపించారు.
DefExpo-2022: ఇలాంటి డిఫెన్స్ ఎక్స్‌పో.. గతంలో ఎప్పుడూ జరగలేదు పో..
ఇటీవల లక్నోలో పస్మాండ ముస్లింలతో బీజేపీ నిర్వహించిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ మెహమూద్ గురువారం ఇలా అన్నారు. “నిజమైన ముస్లిం ఎప్పటికీ బీజేపీకి ఓటు వేయరు. ఎందుకంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పటికీ ముస్లింలకు దగ్గర కాలేరు. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను ఆరాధించే వ్యక్తులను ముస్లింలు ఎప్పటికీ విశ్వసించలేరు.” అని ఆయన ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలకు భయపడుతున్నారని, అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఆమె ఎప్పుడూ మాట్లాడరని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ సమాజ్‌వాదీ పార్టీ అని ఆయన పేర్కొన్నారు.