Eng vs Ire: టీ20 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు ఖంగుతింది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్.. ఇంగ్లండ్ మీద 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఐరిష్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండ్రూ బిల్బిర్నీ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్‌కు మూడు, సామ్ కరణ్‌కు రెండు, మార్క్‌వుడ్‌కు మూడు, బెన్‌స్టోక్స్‌కు ఒక వికెట్ దక్కాయి.
Jio and Vi Festive Deals: స్పెషల్ ఆఫర్లకు జియో, ఐడియా గుడ్‌బై.. త్వరపడితేనే మరి..!
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టును ఐరిష్ జట్టు తమ ఆటతీరుతో మట్టికరిపించింది. ఇంగ్లాండ్ కీలక వికెట్లను పడగొట్టి కష్టాల్లోకి నెట్టింది. 29 పరుగులకే 3 కీలక వికెట్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్ పెవిలియన్ చేరడంతోఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన హ్యారీ బ్రూక్, డేవిడ్ మలన్ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారు కూడా అనంతరం ఔటయ్యి అదే బాట పట్టారు. ఉత్కంఠగా సాగుతున్న ఇంగ్లండ్- ఐర్లాండ్ మ్యాచ్‌కు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఇంగ్లండ్ గెలవాలంటే 33 బంతుల్లో 53 పరుగులు అవసరమైన వేళ.. అలీ, లివింగ్‌స్టోన్ క్రీజులో ఉన్న సమయంలో వర్షం పడింది. ఆ సమయంలో 14.3 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్లు 5 వికెట్లు కోల్పోయి 105 పరుగుల వద్ద ఉంది. వర్షం కారణంగా కాసేపు ఆటను ఆపారు. ఇక వర్షం తగ్గే అవకాశాలు కనిపించకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ గెలిచినట్లు ప్రకటించారు. ఐర్లాండ్ బౌలర్లు జోషువా లిటిల్ 2 వికెట్లు తీయగా.. బ్యారీ మెకార్తీ, ఫియోన్ హ్యాండ్, జార్జ్ డాక్రెల్ తలో వికెట్ తీశారు.