పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సున్నితంగా మందలించారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.
ఓ మహిళ చేసిన పొరపాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృతి చెందారు.
ఇంటిపనులు చేయమని పెళ్లి అయిన మహిళకు చెప్పడం క్రూరత్వం కిందకు రాదని, పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ వెల్లడించింది.
భార్యపై కారు ఎక్కించిన బాలీవుడ్ సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రాను ముంబై పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత తాను వేరే మహిళతో ఉండటాన్ని గుర్తించిన భార్యను కారుతో ఢీకొట్టాడు.
సినీ నటి ఖుష్బూపై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీలోని ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొగడ్తలతో ముంచెత్తారు. పుతిన్ గురువారం మాస్కోకు చెందిన థింక్ ట్యాంక్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్‌లో తన వార్షిక ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు.
మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి అబ్దుల్ సత్తార్ బీడ్ జిల్లా కలెక్టర్ రాధాబినోద్ శర్మను 'మద్యం తాగుతావా' అని అడిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.
కర్ణాటక బెంగళూరులోని యెళహంకలో ఈ నెల 22వ తేదీన ఓ లేఔట్‌లో భవనంపై చంద్రశేఖర్(35) అనే కార్మికుడు తల, మర్మాంగాలపై గాయాలతో హత్యకు గురైన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తోన్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొన్ని నెలలుగా యుద్ధం చేస్తోన్న రష్యా తమ దేశంలో నిర్బంధ సైనిక సమీకరణ అమలు చేస్తోంది. బలవంతంగా సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి పంపిస్తోంది.