తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత యోగా తరగతులు ఆగవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 'ఢిల్లీ కి యోగశాల' స్కీమ్ ఫైల్‌పై అక్టోబర్ 26న సంతకం చేశారని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం సాధించిన ప్రగతి గురించి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన మన్ కీ బాత్‌లో భారతదేశం సౌర, అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తోందని అన్నారు.
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీడియా ప్రత్యేక లేఖను రిలీజ్ చేశారు. తాను ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి టికెట్ కొన్ని ప్రేక్షకులను తప్ప తానెవరిని మోసం చేయలేదని పూరి జగన్నాథ్ లేఖలో తెలిపారు.
టీ-20 ప్రపంచ కప్ సూపర్ -15 గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో ఎట్టకేలకు బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది. ఢిల్లీలో ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత నానాటికి క్షీణిస్తుంది. గత 4 రోజులుగా గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-AQI) 300 పైనే ఉండడం గమనార్హం.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బీజేపీ అవకాశం కల్పిస్తే లోక్‌సభ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.