రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు.
గుజరాత్‌లో మోర్బీ వంతెన దుర్ఘటన 'యాక్ట్ ఆఫ్ గాడ్' అని బ్రిడ్జికి మరమ్మతులు చేసిన ఒరేవా కంపెనీ మేనేజర్ కోర్టులో వాదించారు. ఈ విషయాన్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు.
కర్ణాటకను కీలక పెట్టుబడి గమ్యస్థానంగా పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అనేక రంగాలలో రాష్ట్రంలో వేగవంతమైన వృద్ధికి 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వ శక్తే ఒక కారణమని అన్నారు.
కొందరు మహిళలు ప్రముఖులనే టార్గెట్ చేస్తూ వలపు వల విసురుతారు. నగ్నంగా వీడియో కాల్ చేసి కవ్విస్తారు. వాటికి స్పందించని వారికి పోర్న్ వీడియోలు పంపి వారిని రంగంలోకి దింపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి అనుభవమే కర్ణాటకలోని ఓ ఎమ్మెల్యేకు ఎదురైంది.
ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన కుటుంబాన్నే అంతమొందించారు. జీతం ఇచ్చిన యజమాని ఫ్యామిలీని మట్టుబెట్టారు. యువతీ యువకుడు పని చేస్తున్న చోటే ప్రేమ వ్యవహారం నడిపించగా.. అది తెలిసిన యజమాని వారిని విధుల్లో నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న వారు కుటుంబం మొత్తాన్ని కడతేర్చారు.
భర్త తనను వేధిస్తున్నాడని, కొడుతున్నాడని భార్య ఫిర్యాదు చేయడం చాలా సార్లు చూసే ఉంటారు. కానీ ఓ భర్త తన భార్య తనను వేధిస్తుందని వాపోయిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
బీహార్ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం కాబోతున్నాయా?. రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి.. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా?