Delhi Air Quality: ఢిల్లీలో మరింత క్షీణించిన వాయు నాణ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది. ఢిల్లీలో ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత నానాటికి క్షీణిస్తుంది. గత 4 రోజులుగా గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-AQI) 300 పైనే ఉండడం గమనార్హం. ఆదివారం ఉదయం ఏక్యూఐ 350గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 4 వందలు దాటిపోటిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా ఆనంద్ విహార్‌లో ఏఐక్యూ 469గా ఉండగా, వజీర్‌పూర్‌లో 417, ముండ్కాలో 392, ఢిల్లీలో 385, ఆర్కే పురంలో 376, ఐటీఓ వద్ద 374, ఓఖ్లా ఫేజ్-2 వద్ద 370గా గాలి నాణ్యత నమోదైంది. వాయు ప్రమాణాలు క్షీణిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా వీలవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
న్యూ ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద మార్నింగ్ వాకర్లు, సైక్లిస్టులు, జాగర్లు గాలి నాణ్యతలో తగ్గుదల కారణంగా ప్రభావితమయ్యారు. ఈనేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఎన్‌సీఆర్‌లో చర్యలకు ఉపక్రమించడంతో పాటు ప్రజలకు కీలక సూచనలు చేసింది. వీలైనంత వరకు ఉద్యోగాలు ఇంటి నుంచి పని చేయాలని, వాయు కాలుష్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఎంపిక చేసిన సేవలు మినహా అన్ని విభాగాల్లో నిర్మాణ పనులుపై నిషేధం విధించింది. రైల్వే స్టేషన్లు, మెట్రో, దవాఖానాలు, విమానాశ్రయాలు తదితర విభాగాలను ఆంక్షల నుంచి సడలించింది. ప్రజలు రవాణా కోసం షేరింగ్ వాహనాలను ఉపయోగించాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది. సైకిల్స్‌ను వినియోగించాలని, వీలైనంత వరకు ఇంట్లో నుంచి పని చేసుకోవాలని కోరింది.
Also Read
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
- BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
Tamilnadu: కోయంబత్తూరు పేలుళ్ల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత
రాజస్థాన్‌లోని 45 బొగ్గు ఆధారిత పారిశ్రామిక యూనిట్లను మూసివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా,32 బొగ్గు ఆధారిత యూనిట్లు (హర్యానాలో 9 యూపీలో 23) శాశ్వతంగా మూసివేయబడ్డాయి. 48 యూనిట్లు (హర్యానాలో 8, యూపీలో 40) ఈ యూనిట్లను ఆమోదించబడిన ఇంధనాలుగా మార్చే వరకు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?