Haryana: 5 నెలల క్రితమే బ్యాంక్ ఉద్యోగినితో పెళ్లి.. వాలెంటైన్ డే రోజున భర్త ఏం చేశాడంటే..!
- దెబ్బ తింటున్న భార్యాభర్తల సంబంధం
- 5 నెలల క్రితమే బ్యాంక్ ఉద్యోగినితో పెళ్లి
- వాలెంటైన్ డే రోజున భర్త ఘాతుకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బ తింటున్నాయి. కలకాలం ఒకరికొకరు తోడుండాల్సిన ఆలుమగల బంధాన్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. అనుమానమో.. వేరే వ్యామోహమో తెలియదు గానీ.. కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. చదువులేనోడు అదే పని చేస్తున్నాడు.. విద్యావంతుడు అదే పని చేస్తున్నాడు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump-Iran: నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు.. పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్
Also Read
హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో బ్యాంక్ ఉద్యోగి అయిన మెహక్.. గురుగ్రామ్‌లో పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ అన్షుల్ ధావన్‌కు ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం మెహక్ గర్భవతిగా ఉంది. అయితే మొదటి నుంచి మెహక్‌పై అన్షుల్ అనుమానాలు పెట్టుకున్నాడు. తరుచుగా గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఆమెతో కొద్దిసేపు గడిపిన తర్వాత ఏమైందో.. ఏమో తెలియదు గానీ కొన్ని గంటలకే ఆమెను హత్య చేశాడు. ఆదివారం అన్షుల్ పోలీసులకు ఫోన్ చేసి ఇంట్లో దోపిడీ దొంగలు పడి తన భార్యను చంపి ఆభరణాలు దోచుకెళ్లారంటూ అబద్దం చెప్పాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అన్షుల్ మాటల్లో తేడాను గమనించారు. విచారణ సమయంలో పదే పదే మాట మార్చాడు. దీంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. భార్యను గొంతు కోసి చంపినట్లుగా ఒప్పుకున్నాడు. మొత్తానికి 18 గంటల్లో కేసును ఛేదించారు.
ఇది కూడా చదవండి: AP New DWCRA Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం!
మొదటి నుంచి భార్య వ్యక్తిత్వాన్ని అనుమానించేవాడని.. ఈ క్రమంలో రోజు గొడవలు జరిగేవని బాధితురాలు తండ్రి కృష్ణ కతురియా వాపోయాడు. సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్‌గా వివాహం చేసినట్లు తెలిపాడు. పెద్దలు కుదిర్చిన వివాహం ఇంత విషాదకరంగా ముగిసిపోతుందని ఊహించలేదన్నారు. మెహక్ గురుగ్రామ్‌లోని HDFC బ్యాంక్‌లో పనిచేస్తుండగా.. అన్షుల్ CAగా పని చేస్తున్నాడు.
- Tags
- Bahadurgarh
- Haryana
- husband
- Mahak
- murder
తాజావార్తలు
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!