సినీ నటి, బీజేపి నేత ఖుష్బూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సాదిక్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. వారం క్రితం సీని నటి ఖుష్బూపై ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీలోని ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారి కుర్చీలో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సురేష్ పాటిల్ ఫిర్యాదు చేయడానికి వచ్చి మాన్‌పాడ పోలీస్ స్టేషన్‌లో ఓ వీడియోను షూట్ చేశాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు.
కొన్ని సినిమాల్లో విలన్ల నుంచి తప్పించుకోవడానికి హీరోలు వాహనంపై దూసుకుపోతుంటే.. ఛేజ్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి. తుపాకులను రవాణా చేస్తున్న వాహనాన్ని నాటకీయ ఫక్కీలో పోలీసులు పట్టుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది.
నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి, హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడైన టికా దత్తా పోఖారెల్ పోటీలో ఉన్నారు.
దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జీఎస్టీ ద్వారా వచ్చే స్థూల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి అక్టోబర్ 2022లో రూ.1,51,718 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాలతో సహా ఎనిమిది జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువారూర్ నాగపట్నంలలో కళాశాలలు కూడా మూసివేయబడ్డాయి.
గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దాదాపు 135 మంది ప్రాణాలను బలిగొన్న మోర్బీ వంతెన దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు.
గుజరాత్‌లో మోర్బీ వంతెన దుర్ఘటన విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచ దేశాలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మోర్బీ వంతెన కూలిన ఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంతాపం వ్యక్తం చేశారు.
ఆర్థిక నేరస్థుడు, రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్ బలవంతంగా తన నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల బెదిరింపులు ఎదుర్కొంటున్న నటుడు సల్మాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు 'వై ప్లస్' గ్రేడ్ భద్రతను అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు మహారాష్ట్ర సర్కారు భద్రతను పెంచినట్టు తెలుస్తోంది.