Nallapureddy Prasannakumar Reddy: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు ఖాయమని అచ్చెన్నాయుడు అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మీ రాజధాని ఏదని అడుగుతున్నారని మాట్లాడాడని అచ్చన్నాయుడిపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడి శరీరం చూస్తే ఒక ఆంబోతు, ఒక ఎలుగుబంటు, ఒక దున్నపోతు, తెలివి లేని దద్దమ్మ ఆయన అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chegunta: ఆ ఊరికి ఏమైంది.. దీపావళి నుంచి 70మంది గ్రామస్తులకు వాంతులు విరేచనాలు
తిరుపతి హోటల్లో టిఫిన్ చేస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా.. పార్టీ లేదూ…. ఏమీ లేదని మాట్లాడాడని.. ఆ వీడియో మొత్తం వైరల్ అయిందన్నారు. రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడో అందరూ చూశారన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసం 165 సీట్లు వస్తాయని చెబుతున్నాడని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరు నియోజక వర్గంలోని నర్సాపురం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఈ నరసాపురం ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చారని తెలిపారు. అయినా కూడా తాము పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.