పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను మరోసారి భారత్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనియాడారు. దేశ ప్రజల కోసం రష్యా నుంచి ధైర్యంగా చమురును కొనుగోలు చేస్తోందన్నారు.
టీ-20 వరల్డ్‌కప్ సూపర్-12 గ్రూప్‌లో పాక్‌పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్నంతా ప్రదర్శించడంతో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. కోహ్లీ ఆటతీరుకు ఎంతో మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.
డీఎంకే నేత సైదాయ్ సాదిక్ రాజకీయ నేతలుగా మారిన నటీమణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరుస్తూ సాదిక్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించాలని సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ డిమాండ్ చేశారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని ఇంట్లో ఉన్న ఆమె భర్త పాల్ పెలోసీ(82)పై దాడి చేసి గాయపరిచాడు.
ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలోనే విమానాన్ని నిలిపివేశారు.
రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కైలాసనాథుడి విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్నారు.