Guntur: గుంటూరులోని ఏఈఎల్‌సీ సంస్థలో మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం ముదిరింది. నగరంలోని నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ పరదేశీబాబు, శ్యామ్ సంపత్ వర్గాల పాస్టర్లు గొడవకు దిగారు.
చర్చిలో పరదేశి బాబు వర్గానికి చెందిన పాస్టర్ బాబురావు ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. తమకు కోర్టు అనుమతిచ్చిందని శ్యామ్ సంపత్ వర్గం పాస్టర్ కెన్నెడీ చర్చిలోకి వచ్చారు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రంగంలోకి పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
నార్త్ ప్యారిస్ చర్చిలో ఉదయకాల ప్రార్థనలు ముగియడంతో ఇరు వర్గాల పాస్టర్లను అరండల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో ఇరు వర్గాల పాస్టర్లతో కొనసాగుతున్నాయి. ఇరువర్గాల పాస్టర్లు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పది గంటల ప్రార్థనపై అనిశ్చితి కొనసాగుతోంది.