Mitchell Marsh: ఇది అవమానకర ఓటమి, ఏడుపొచ్చేస్తోంది.. మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు!
- మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు వరుస షాకులు
- తాజాగా శ్రీలంక చేతిలోనూ ఓటమి
- మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mitchell Marsh Calls Australia’s Loss Embarrassing After Defeat vs Sri Lanka: టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు వరుస షాకులు తగులుతున్నాయి. గ్రూప్-బిలో జింబాబ్వే చేతిలో ఇప్పటికే దారుణ ఓటమిని మూటగట్టుకున్న ఆసీస్.. తాజాగా శ్రీలంక చేతిలోనూ ఓడిపోయింది. శ్రీలంకతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. లంక 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ ఓటమితో ఆసీస్ సూపర్ 8 అవకాశాలు సన్నగిల్లాయి. గ్రూప్-బిలో ఇప్పటికే లంక సూపర్ 8కే చేరుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓ విజయం సాధిస్తే జింబాబ్వే కూడా అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు దాదాపు దారులు మోసుకుపోయినట్లే.
శ్రీలంకపై మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ఓటమిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఇది అవమానకర ఓటమి ఐ పేర్కొన్నాడు. ‘బ్యాటింగ్‌లో మాకు మంచి ఆరంభం దక్కింది. మొదటి అర్ధభాగం ముగిసే సరికి భారీ స్కోరు ఖాయం అందుకున్నాము. ఆరంభం బాగున్నప్పటికీ చివరి ఓవర్లలో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాము. స్కోర్ బోర్డుపై మేం మరిన్ని పరుగులు ఉంచాల్సింది. లంక చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌పై పట్టుసాధించింది. భారీ స్కోర్లు చేయగల సామర్థ్యం తమ జట్టుకు ఉంది. కానీ.. ఈ మ్యాచ్‌లో ఆ స్థాయికి చేరుకోలేకపోయాము’ అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.
Also Read
- IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
- Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
Also Read: T20 World Cup 2026: గ్రూప్-బిలో తీవ్ర పోటీ.. సూపర్-8 బెర్త్ రేసులో జింబాబ్వే, ఆస్ట్రేలియా ఇంటికేనా?
‘ఇది అవమానకర ఓటమి. సూపర్ 8 అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఇప్పుడు మా భవితవ్యం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా జింబాబ్వే –ఐర్లాండ్ మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాము. జింబాబ్వే గెలిస్తే మేము టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి జట్టును మరింత ఒత్తిడిని కలిగిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోయాము’ అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో పరిస్థితులు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి.
తాజావార్తలు
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్‌సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!