T20 Worldcup: భారత్ గెలుపు కోసం పాక్ పూజలు.. మరి వరుణుడు కరుణిస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 Worldcup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. పటిష్ట జట్టయిన దక్షిణాఫ్రికా మనకు సవాల్ విసురుతోంది. ఈ మ్యాచ్ నెగ్గితే టీమిండియాకు గ్రూప్‌లో అగ్రస్థానం మాత్రమే కాక సెమీస్ బెర్త్ కూడా దాదాపు ఖాయమవుతుంది. ఈ మ్యాచ్ ఓడితే నాకౌట్ బెర్తు కోసం మళ్లీ ఉత్కంఠ తప్పదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని పాకిస్థాన్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే, ఇందుకో కారణం కూడా ఉంది. సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో ఇండియా చేతిలో ఓడిన పాకిస్థాన్, అనంతరం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. దీంతో గ్రూప్-2లో చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయిన పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాక్ జట్టు సెమీస్ ఆశలు చిగురించాలంటే భారత జట్టు తన తదుపరి మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
పాకిస్థాన్ ఇంకా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉండగా.. ఈ మూడు మ్యాచుల్లోనూ అది విజయం సాధించినా సెమీస్‌కు చేరడం కష్టమే. బాబర్ సేన సెమీస్‌కు చేరుకోవాలంటే భారత జట్టు నేడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తోపాటు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపైనా విజయం సాధించాలి. అప్పుడు ఆయా జట్ల సెమీస్ అవకాశాలకు గండి పడుతుంది. ఇది పాకిస్థాన్‌కు వరంగా మారుతుంది. కాబట్టే భారత్ తలపడే మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియా మ్యాచ్ ఆడుతుంటే పాకిస్థాన్ వాళ్లు ప్రార్థించడం ఎప్పుడైనా జరిగిందా.. అంటే ఈ ఆదివారం ఆ దృశ్యమే చూడబోతున్నాం. ఎందుకంటే పాక్ జట్టు సెమీస్ చేరడం భారత్ చేతుల్లోనే ఉంది. అందుకే భారత్ గెలవాలని దాయాది జట్టు కోరుకుంటోంది. పెర్త్‌లోని ఆప్టస్ మైదానంలో గతంలో 21 మ్యాచ్‌ల్లో మొదటి బ్యాటింగ్ చేసిన 13 జట్లు గెలుపొందాయి. కావున మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలుపు అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Ind vs SA: దక్షిణాఫ్రికాతో భారత్ పోరు నేడే.. గ్రూప్‌లో అగ్రస్థానంపై కన్నేసిన జట్లు
ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచిన టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనున్న నేపథ్యంలో వరుణుడు కరుణిస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచించడంతో అభిమానులు భయపడుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం.. సాయంత్రం మేఘావృతమై ఉంటుందని.. కానీ కొన్ని చోట్ల వర్షం ఉండదని ప్రకటించింది. ఇప్పటి వరకు వర్షం కారణంగా ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లు రద్దయ్యాయి. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. శనివారం కూడా పెర్త్‌లో వర్షం కురిసింది. సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి భారత్, దక్షిణాఫ్రికా జట్లకు ఇది కీలక మ్యాచ్. ఈ కీలక మ్యాచ్‌లో వాతావరణం కీలక పాత్ర పోషించనుంది.
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!