జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి, పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేయడానికి చైనా కొత్తగా ప్రారంభించిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి వాటిని పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి ఒడిశా పోలీసు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనను దోచుకున్నారని ఫిర్యాదు చేయడానికి రాగా.. ఒడిశా పోలీసులు నిరాకరించారని, దానికి ప్రతీకారంగా వారి వాహనాన్ని దొంగిలించానని ఈ వ్యక్తి పేర్కొన్నాడు.
దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన హవా కొనసాగించింది. మొత్తం 7స్థానాల్లో ఎన్నికలు జరగగా.. బీజేపీ 3 సీట్లను కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్, హర్యానాలోని ఆదంపూర్‌లో బీజేపీ విజయం సాధించగా, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో ఆధిక్యంలో ఉంది.
భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరో రోజుకు చేరింది. ఈనెల 14వ తేదీ వరకు భక్తి టీవీ కోటిదీపోత్సవం కొనసాగనుంది.
గోవా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హాలిడే గమ్యస్థానాలలో ఒకటిగా ఎందుకు ఉందో అర్థం చేసుకోవడం చాలా సులభం. ఈ ప్రసిద్ధ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఏమి చేయాలో ఎంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గోవా అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు.
ఇవాళ కన్నుమూసిన స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగీ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో గల కల్పానికి బయలుదేరారు.
తల్లి అయిన నాయనమ్మ అంటే ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే సరోగసీ పుణ్యమా అని ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది.