Grandmother Delivery: తల్లి అయిన నాయనమ్మ.. కొడుకు బిడ్డకు జన్మ.. ఎలాగంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grandmother Delivery: తల్లి అయిన నాయనమ్మ అంటే ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే సరోగసీ పుణ్యమా అని ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన క్రమంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులు మరో అవకాశం లేకుండా పోయిందని అమెరికా మీడియా వెల్లడించింది. ఒక తల్లి సరోగేట్‌గా మారి అమెరికాలోని ఉతాహ్‌లోని తన కొడుకు బిడ్డకు జన్మనిచ్చింది. జెఫ్ హాక్ అనే వ్యక్తి తన భార్య గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చిన తర్వాత పలు ఎంపికలను పరిశీలించారు. చివరకి సరోగసీని ఆశ్రయించాలనుకున్నారు. జెఫ్ హాక్ యొక్క 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ అతనికి సరోగేట్‌గా ముందుకు వచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇది అందమైన క్షణంగా హాక్ వర్ణించారు.
Urinating On Train Track: ఆగలే మనోడికి.. మెట్రో రైల్వే ట్రాక్‌పైనే మూత్రం పోసేశాడు.. వీడియో వైరల్
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
నాన్సీ హాక్ దీనిపై మాట్లాడుతూ ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం” అని తెలిపింది. పాప అమ్మమ్మకు నివాళిగా ఆ చిన్నారికి ”హన్నా” అని పేరు పెట్టారు. ఉతాహ్ టెక్ యూనివర్శిటీలో పనిచేస్తున్న నాన్సీ, పరీక్ష లేకుండా కూడా తనకు ఆడపిల్లే పుడుతుందని నమ్మకంగా ముందే చెప్పడం గమనార్హం. ఆమె చెప్పినట్లుగానే ఆడపిల్ల పుట్టింది. జెఫ్ హాక్ తల్లి తన మనవరాలికి జన్మనిచ్చింది. మరోవైపు.. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ఇది ఒక గొప్ప సందర్భమని, ఎంత మంది తన తల్లి జన్మనివటాన్ని చూస్తారని పేర్కొన్నాడు జెఫ్ హాక్. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్ భావోద్వేగానికి గురయ్యారని, అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్ వెల్లడించింది. దీనిపై డాక్టర్ రస్సెల్ ఫౌల్క్ మాట్లాడుతూ మహిళ తన మనవలకు జన్మనివ్వడం అసాధారణం అయినప్పటికీ, వయస్సు నిజంగా పరిమితం చేసే అంశం కాదు. ఇది వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించినదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!