జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలంటూ హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది.
పోలండ్‌కు చెందిన అధికార పార్టీ నేత జరోస్లావ్ కాజిన్స్కీ యువతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జననాల రేటు పడిపోవడానికి కారణం యువతులు అధికంగా మద్యపానం చేయడమేనని పాలకపక్ష నాయకుడు జరోస్లావ్ కాజిన్స్కీ వ్యాఖ్యానించారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్‌లో ఐదు మ్యాచ్‌లకు గానూ నాలుగింటిని గెలిచి టీమిండియా సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఇంగ్లండ్ జట్టుతో సెమీస్ ఆడనుంది భారత్.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని కట్ని జిల్లాలో ఇప్పటివరకు 85 పందులు చనిపోయాయని, 115 పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు గుర్తించామని సోమవారం ఒక అధికారి తెలిపారు.
అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టం కింద పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని నెలరోజుల క్రితమే సంకేతాలు ఇచ్చారు. 2024లో వైట్‌హౌస్ రేసులో మాజీ అధ్యక్షుడు దూకాలని భావిస్తున్నందున వచ్చే వారం తాను చాలా పెద్ద ప్రకటన చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులకు ఉండగా.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ ఖండ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర సభ్యులు సోమవారం బీజేపీలో చేరారు.
దేశంలో ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దసరా, దీపావళి బొనాంజా తర్వాత వ్యాపారులకు భారీ బొనాంజా తగలనుంది. దేశంలో ఈ నెల 4న మొదలైన పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని, ఈ సీజన్‌లో మొత్తంగా 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది.
మహారాష్ట్ర ముంబయిలోని అంధేరి ఈస్ట్‌కు జరిగిన ఉపఎన్నికలో ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే భార్య రుతుజ లట్కే విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటా నిలిచింది.