CEC Rajivkumar: ఇవాళ కన్నుమూసిన స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగీ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో గల కల్పానికి బయలుదేరారు. ఆయన 106 సంవత్సరాల వయస్సులో ప్రాణాలు కోల్పోయారు. సీఈసీ రాజీవ్‌కుమార్ శ్యామ్ శరణ్ నేగి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 2న నేగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన చివరి ఓటు వేశారు. రెండు రోజుల క్రితమే అధికారులు రెడ్ కార్పెట్ వేసి మరీ ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయించారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆయన మరణించడం పట్ల హిమాచల్ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది.
1951 అక్టోబరు 23న కల్పా పోలింగ్ స్టేషన్‌లో దేశంలోనే మొదటి సాధారణ ఎన్నికలలో నేగి తన మొదటి ఓటు వేశారు. ఈ ఏడాది నవంబర్ 2న ఆయన 34వ సారి ఓటు వేశారు. అదే ఆయనకు చివరి ఓటు కావడం గమనార్హం.
హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా కిన్నౌర్‌లో జూలై 1917లో జన్మించిన నేగి 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన పేరు మారుమోగింది. లోక్‌సభ ఎన్నికల్లో 16 సార్లు ఓటు వేశారు.హిమాచల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ ప్రకారం.. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన నేగి 1951 నుండి ప్రతి ఎన్నికల్లో ఓటు వేసేవాడు. ఎన్నడూ ఓటు వేసే అవకాశాన్ని వదులుకోలేదు. శ్యామ్ శరణ్ నేగి మృతికి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి పౌరుడిని, ముఖ్యంగా యువత ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తమ కర్తవ్యంగా నిర్వర్తించేలా స్ఫూర్తి నింపుతారని అన్నారు.
Grandmother Delivery: తల్లి అయిన నాయనమ్మ.. కొడుకు బిడ్డకు జన్మ.. ఎలాగంటే..!
ఆయన మరణంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ స్వతంత్ర భారత తొలి ఓటరు, కిన్నౌర్‌కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ మరణవార్త వినడం బాధాకరం’’ అని సీఎం ట్వీట్ చేశారు. భారతదేశ తొలి ఓటర్ అయిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి ఈ ఉదయం ఆయన స్వస్థలం కల్పాలో కన్నుమూశారు.. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కిన్నౌర్ కలెక్టర్ వెల్లడించారు. ఇటీవల ఆయన ఓటేసిన సందర్భంలో ప్రధాని మోదీ.. ‘‘ఇది అభినందనీయం.. యువ ఓటర్ల ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రేరణగా ఉపయోగపడుతుంది.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి’’ అంటూ ట్వీట్ చేశారు.