ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసి, భారీ మార్పులు తీసుకొస్తూ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న ప్రపంచ కుబేర వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా రాజకీయాలపై దృష్టి సారించారు. మొట్టమొదటి సారిగా రాజకీయాలకు సంబంధించిన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని పాటలను ప్లే చేసినందుకు గాను ఒక సంగీత సంస్థ కాంగ్రెస్‌పై కాపీరైట్ కేసు దాఖలు చేయడంతో బెంగళూరు కోర్టు కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశించింది.
ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ మూర్ఖత్వం ఎంతలా అంటే సొంత కూతురినే చంపుకునేంత. అవునండీ.. మూఢనమ్మకంతో ఓ తల్లి కొడుకు కోసం కూతురినే చంపుకుంది.
కుటుంబసభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సి వెళ్లి వేడుక విషాదంగా మారింది. పెళ్లికి ఆతిథ్యం ఇస్తున్న ఓ రెస్టారెంట్ ముందు గొడవ.. తీవ్రంగా మారి నలుగురు వ్యక్తుల మృతికి దారితీసింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ మాత్రమే సవాలు చేయగలదని, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు.
పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత ఆరేళ్ల తర్వాత కూడా నగదు వినియోగం ఇంకా తగ్గలేదు. ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అక్టోబరు 21 నాటికి రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.
అక్టోబర్ 30వ తేదీన గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన దుర్ఘటనలో దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ కొత్త ఎన్నికల నినాదాన్ని గుజరాతీలో ప్రారంభించారు. 'నేను ఈ గుజరాత్‌ని తయారు చేశాను' అంటూ ఎన్నికల నినాదాన్ని ప్రారంభించారు.