Kotideepotsavam 6th Day: భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరో రోజుకు చేరింది. ఈనెల 14వ తేదీ వరకు భక్తి టీవీ కోటిదీపోత్సవం కొనసాగనుంది. కోటి దీపోత్సవం కోసం ప్రతి రోజూ ఎన్టీఆర్ స్టేడియం అందంగా ముస్తాబవుతోంది. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తి టీవీ భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కోటి దీపోత్సవానికి వచ్చే భక్తులకు ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాయి.

ఆరో రోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేందర్ దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంఖారావంతో ప్రారంభమైన ఆరో రోజు కోటి దీపోత్సవ మహోత్సవంలో శ్రీ వ్రతధర జీయర్ వేదపాఠశాల ఆధ్వర్యంలో వేదపఠనం జరిగింది. క్షీరాబ్ది ద్వాదశి శుభవేళ మహాదేవునికి “ప్రదోషకాల అభిషేకం” నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనామృతం జరిగింది. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు. ఆ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా.. శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ శుభవేళ శ్రీ వేంకటేశ్వర స్వామికి, శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామికి కోటితులసి అర్చన చేశారు. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దర్శన భాగ్యం, సిరిసంపదలు అనుగ్రహించే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం జరిగాయి. కల్పవృక్ష వాహనంపై సింహాచలేశుని అనుగ్రహం భక్తులకు లభించింది.

కాగా ప్రతీ ఏటా కార్తిక మాసంలో ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు.. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కార్తిక మాసం శుభవేళ బంగారు లింగోద్భవ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలు ఓం నమఃశివాయా నామ స్మరణతో మార్మోగిపోతున్నాయి.. విశేషమైన భక్తుల మధ్య.. అన్ని కార్యక్రమాలు ఆద్యంతం కోటిదీపోత్సవం ఆరోరోజు రోజు కన్నుల పండుగగా సాగాయి.
కోటి దీపోత్సవం -2022 6వ రోజు ఉత్సవంలో భాగంగా కల్పవృక్ష వాహనం పై సింహాచలం ఉత్సవమూర్తులు ఊరేగింపు
Watch Live ► https://t.co/NRzECRAsBQ#BhakthiTV #Kotideepotsavam2022 #NtvTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam pic.twitter.com/0fXkJSkNYf
— BhakthiTV (@BhakthiTVorg) November 5, 2022