Old Monk Tea: గోవాలో ఓల్డ్ మాంక్ టీ.. తాగితే గ’మ్మత్తే’.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Old Monk Tea: గోవా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హాలిడే గమ్యస్థానాలలో ఒకటిగా ఎందుకు ఉందో అర్థం చేసుకోవడం చాలా సులభం. ఈ ప్రసిద్ధ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఏమి చేయాలో ఎంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గోవా అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు. ఈ అందమైన తీర రాష్ట్రంలోని అనేక మార్కెట్లలో షాపింగ్ చేయడం నుంచి అక్కడి వంటకాలను రుచి చూడడం, వాటర్ గేమ్స్ ఇలా పర్యాటకులకు ఫేవరెట్ స్పాట్‌గా నిలిచింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన సందర్శకులు సాంప్రదాయకంగా స్థానిక వంటకాలు, పానీయాలకు ప్రాధాన్యత ఇస్తారు. గోవాలోని లోకల్ రుచులను రుచి చూడడానికి చాలా మంది ఉబలాటపడుతుంటారు. అయితే ఒక టీ దుకాణం ఇటీవల దాని మెనూలో ప్రత్యేకమైన దాన్ని జోడించింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే.. ఓల్డ్ మాంక్ టీ. నిజమేనండి.. టీలో ఓల్డ్ మాంక్ పోసి అమ్ముతున్నాడు ఓ టీ వ్యాపారి. దానిని సేవించడానికి టీ ప్రియులు ఎంతో మక్కువ చూపిస్తున్నారు.
Vandemataram: వందేమాతరం, జనగణమనకు సమానహోదా.. ఢిల్లీ కోర్టులో కేంద్రం
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయగా.. నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన లభించింది. ఈ వీడియోలో తందూరీ టీ విధానాన్ని పాటించాడు. నిప్పులో నుంచి టీ కప్ తీసి అందులో తొలుత కొంత బెల్లపు పౌడర్ యాడ్ చేశాడు. ఆ తర్వాత అందులో ఓల్డ్ మంక్ రమ్ కొద్దిగా యాడ్ చేశాడు. ఇక సాధారణ తందూరీ టీ చేసినట్టుగానే మిగతా వస్తువులు కూడా అందులో యాడ్ చేశాడు. ఈ ఓల్డ్ మంక్ టీ గోవాలోని సింక్వెరిమ్ బీచ్ వద్ద లభించనుంది. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. కొందరు ఈ రకంపై టేస్ట్‌పై ఆసక్తి చూపగా.. కొందరు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయోగాలు చాలించండి అంటూ మండిపడ్డారు.
https://twitter.com/DrVW30/status/1588171508362665984?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1588171508362665984%7Ctwgr%5Ec6b19f066c29370fad86a87bf794a25ca4766d01%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Fviral-video-shows-goa-tea-vendor-selling-old-monk-tea-3493356
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!