ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ ప్రక్షాళన చర్యలు చేపడుతున్నాడు. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్‌తో ట్విట్టర్ ను సొంత చేసుకున్న ప్రపంచ కుబేరుడు..ట్విట్టర్‌లో తన మార్క్ చూపిస్తున్నాడు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల వజీరాబాద్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. ఇమ్రాన్‌కు ప్రాణహాని తప్పడంతో పీటీఐ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనను ఇమ్రాన్ మాజీ భార్యలు ఖండించారు.
విమానాశ్రయాలు గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ బంగారాన్ని తరలిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారుల ముందు బంగారం స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు.
దేశవ్యాప్తంగా కాంతారా చిత్రం ప్రమోషన్స్ చేసే పనిలో నిమగ్నమైన రిషబ్ శెట్టిని దక్షిణాఫ్రికా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఏబీ డివిలియర్స్ కలిశాడు.
అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు.. అడవిని తగలబెట్టొచ్చు.. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా సాంకేతిక ప్రగతిని వినియోగించే పరిస్థితి కూడా అంతే. అశ్లీలం నెట్టింట్లో నుంచి నట్టింట్లోకి వచ్చేస్తోంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 4న నిర్వహించబడుతుంది.
కడుపు నొప్పితో బాధపడుతున్న నవజాత శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పాపకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు 8 పిండాలను వెలికితీశారు. దీనితో ఆ పాప కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.
గుజరాత్‌లో ఎన్నికల తేదీలు ప్రకటించిన వేళ పలు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు.