ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో రైలు ట్రాక్‌లపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఛీ.. అంటూ అసహ్యించుకుంటున్నారు. సభ్యత, సంస్కారం లేదా అతనికి అంటూ మండిపడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరోసారి దాడులు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. అతడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
రాష్ట్రంలో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు.
త్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా రేవాలిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మహిళా సర్పంచ్ భర్తను మావోయిస్టులు. హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలో పడేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు.
ఎన్నికల నేపథ్యంలో హిమాచల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ కేవలం దేశ భద్రతకు విరుద్ధమే కాదు.. దేశాభివృద్ధికి కూడా వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు.
300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీతో హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ తన పది పాయింట్ల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలగితే దర్యాప్తులో చిక్కుకున్న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను విడిచిపెడతామని బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన రోజుల వ్యవధిలోని అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
Imran Khan: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం దాడిపై మౌనం వీడారు. దాడిలో నాలుగు బుల్లెట్లు తగిలాయని ఆయన వెల్లడించారు. జాతినుద్దేశించి చేసిన తన మొదటి ప్రసంగంలో తనపై గురువారం జరిగిన హత్యాయత్నం గురించి వివరించారు. ర్యాలీకి వెళ్లడానికి ఒకరోజు ముందు తనపై వజీరాబాద్ లేదా గుజరాత్‌లో హత్యకు ప్లాన్ చేస్తున్నారని తనకు తెలుసన్న ఆయన.. లాహోర్‌లోని ఆసుపత్రిలో టెలివిజన్ ప్రసంగంలో […]
గుజరాత్‌లో మోర్బీలలో వంతెన కూలిన దుర్ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ విభాగం చీఫ్ ఆఫీసర్(సీవో)ను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.