సాధారణంగా డబ్బులు, నగల కోసం చోరీలు జరుగుతుంటాయి. అయితే ఒక వ్యక్తి ఏకంగా టూత్‌పేస్ట్‌లను చోరీ చేశాడు. చివరకు ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.
తనను నాశనం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కోట్లు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం మండిపడ్డారు. 'సొంత పార్టీని నాశనం చేస్తున్న వ్యక్తి, నాశనం చేయడం గురించి ఎలా మాట్లాడగలడు' అని బీజేపీ మంత్రి అన్నారు.
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒక వ్యక్తి ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీరు త్రాగాలని వైద్యులు, నిపుణులు తరచుగా సిఫార్సు చేస్తూనే ఉంటారు. అయితే ఓ అధ్యయనం ప్రకారం రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు చాలా ఎక్కువ కావచ్చని అంటున్నారు.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. భారత్ 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసిన సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలగడంతో చివరికి ఆట రద్దయింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పలు పార్టీలకు చెందిన నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు అగ్రనేతల ప్రచారంతో గుజరాత్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కిది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డైమండ్ సిటీ సూరత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించి ఆటను ప్రారంభించారు. వర్షం తగ్గిపోవడంతో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
భారత ఐటీ సేవల రంగంలో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల సగటుతో పోలిస్తే.. అక్టోబరులో ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో నియామకాలు 43 శాతం తగ్గాయి.
బ్రిటన్‌లో రిషి సునాక్ సర్కారును వలసలు కలవరపెడుతున్నాయి. ఆ వలసలను తగ్గించేందుకు రిషి సునాక్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ విద్యార్థులపై ఆంక్షలు తీసుకురావాలని యోచిస్తోంది.
కన్నవారే కాదన్నా.. సమాజం పట్టించుకోకపోయినా వెనకడుగు వేయకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి ఉన్నత విలువలు కలిగిన హిజ్రానే యూపీకి చెందిన మహీ గుప్తా.