Union Minister Giriraj Singh: తనను నాశనం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కోట్లు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం మండిపడ్డారు. ‘సొంత పార్టీని నాశనం చేస్తున్న వ్యక్తి, నాశనం చేయడం గురించి ఎలా మాట్లాడగలడు’ అని బీజేపీ మంత్రి అన్నారు. ముస్లిం సమాజంపై ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదని, అయితే రాడికల్ భావాలతో కరడుగట్టినవారు సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు.
“పస్మాండ ముస్లింలు ఛత్ పూజ చేసే గ్రామాలను సందర్శించాను. ముస్లింల పట్ల మాకు ఎలాంటి ద్వేషం లేదని నేను పదే పదే చెబుతున్నాను. సమాజంలో విషాన్ని వ్యాపింపజేసే కరడుగట్టినవాదులే సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఒవైసీ లాంటి వ్యక్తులు దేశానికి ప్రమాదకరం” అని ఆయన అన్నారు. బీహార్‌లో మహాఘటబంధన్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే కారణమని ఆయన వెల్లడించారు. నేడు బీహార్‌లో మహాఘటబంధన్‌లో ఉన్న పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, కేవలం ముస్లిం ఓట్ల కోసం మాత్రమే చూస్తు్న్నారని ఆయన ఆరోపించారు.
Supreme Court: ఇలాగైతే న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
అంతకుముందు ఆదివారం జనాభా నియంత్రణ బిల్లును వారి మతం లేదా వారు చెందిన సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అమలు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నొక్కి చెప్పారు. పరిమిత వనరుల లభ్యతను పేర్కొంటూ ఈ బిల్లును అమలు చేయడం ‘కీలకమైనది’ అని పేర్కొన్నారు. “మనకు పరిమిత వనరులు ఉన్నందున జనాభా నియంత్రణ బిల్లు చాలా కీలకమైనది. చైనా జనాభాను నియంత్రించడానికి ‘ఒక బిడ్డ విధానాన్ని’ అమలు చేసి తద్వారా అభివృద్ధిని సాధించింది,” అని గిరిరాజ్ సింగ్ చెప్పారు. చైనాలో నిమిషానికి 10 మంది పిల్లలు పుడుతుండగా, భారత్‌లో నిమిషానికి 30 మంది పిల్లలు పుడుతున్నారు, మనం చైనాతో ఎలా పోటీపడతాం? అని సింగ్ అన్నారు. విశ్వాసం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ బిల్లును అమలు చేయాలని ఆయన అన్నారు