రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య హింసాత్మక పోరాటం చోటుచేసుకుంది. ఈ దాడుల్లో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులకు తెగబడగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథ్ ప్యాలెస్‌లో అగ్నిమాపక సిబ్బంది వరుసగా మూడో రోజు శనివారం కూడా మంటలను ఆర్పేందుకు శ్రమిస్తుండగా.. భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో కివీస్ విజయం సాధించగా.. ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. 4.5 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.
గుజరాత్‌లో డిసెంబర్‌లో జరగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచర జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
స్సాంలోని చరైడియో జిల్లాలోని రెండు పాఠశాలలకు చెందిన మొత్తం 50 మంది విద్యార్థులు శనివారం ఆరోగ్య శాఖ కార్యకర్తలు అందించిన ఐరన్-ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలను సేవించిన కారణంగా అస్వస్థతకు గురయ్యారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌లను ప్రసారం చేయకుండా సౌదీ అరేబియా ఖతార్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను బ్లాక్ చేసింది. దీంతో చాలా మంది క్రీడాభిమానులు సౌదీ అరేబియా ఆటగాళ్ల విజయాన్ని చూడలేకపోయారు.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్‌ల స్థానంలో దీపక్ హుడా, దీపక్ చాహర్‌లను తీసుకురావడంతో భారత్ రెండు మార్పులు చేసింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ సీ54 విజయవంతమైంది.
నిద్రలో కలలు రావడం చాలా సహజం. మనలో చాలామందికి ఎప్పుడూ ఏవేవో కలలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మంచి కలలు, కొన్ని పీడకలలు వస్తుంటాయి. కొందరు వాటిని పట్టించుకోరు, మరికొందరు వాటిని సీరియస్‌గా తీసుకుంటారు.
న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ కావడం చాలా అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.