toothpaste thief: సాధారణంగా డబ్బులు, నగల కోసం చోరీలు జరుగుతుంటాయి. అయితే ఒక వ్యక్తి ఏకంగా టూత్‌పేస్ట్‌లను చోరీ చేశాడు. చివరకు ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. లాహోరీ గేట్‌లోని ఓ దుకాణంలో కనీసం 23,400 టూత్‌పేస్టులు, ఒక మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌కు చెందిన ఉదల్ అకా సంతోష్‌గా గుర్తించారు. కొన్ని రోజుల కిందట లాహోరీ గేట్ ప్రాంతంలోని గోడౌన్ నుంచి 215 బాక్సుల టూత్‌పేస్ట్ మాయమైంది. దీంతో వ్యాపారి కున్వర్ పాల్ సింగ్ ఈ నెల 22న ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గోడౌన్ నుంచి 215 టూత్‌పేస్ట్ బాక్సులు మాయమయ్యాయని చెప్పాడు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటాయని తెలిపాడు. కనిపించకుండా పోయిన గోడౌన్ మేనేజర్ ఉదయ్ కుమార్ అలియాస్ సంతోష్‌పై అతడు అనుమానం వ్యక్తం చేశాడు.
లాహోరీ గేట్‌లోని రంగ్‌మహల్‌లో నివాసం ఉంటున్న గిడ్డంగి యజమాని కున్వర్‌పాల్ ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశారు. ఫిర్యాదుదారుడి గోడౌన్ నుంచి క్లోజ్అప్, డాబర్-రెడ్ కంపెనీల టూత్‌పేస్టులు, ఒక మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యాయి. పోలీసులు చోరీ జరిగిన గోడౌన్‌ను సందర్శించి.. దాదాపు 40 సీసీటీవీ ఫుటేజీలను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక నిఘా సహాయంతో 23 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. దొంగిలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు ఉదల్ అకా సంతోష్ తప్పును ఒప్పుకున్నాడు. అతను ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని స్థానిక ప్రాంతంలో కూలీగా పని చేసేవాడని, కొన్ని వారాల క్రితం తిలక్ బజార్‌లోని రంజన్ నివాసి ద్వారా గోడౌన్‌లో కార్మికుడిగా చేరాడు.
Cricketers Marriage: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు క్రికెటర్లు
కాలక్రమేణా యజమాని నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అనంతరం గౌడౌన్ నుంచి లక్షల విలువైన టూత్‌పేస్ట్ బాక్సులను దొంగిలించడానికి ప్లాన్ చేసాడు. గోడౌన్ వెలుపల చిన్న టీ-స్టాల్ నడుపుతున్న గుడ్డు అనే చాయ్‌వాలాకు యజమాని తరచుగా గోడౌన్ తాళాలను ఇచ్చి వెళ్తాడు. అది తెలుసుకున్న సంతోష్.. నవంబర్ 20న సాయంత్రం సమయంలో యజమాని లేకపోవడంతో గుడ్డు నుంచి గోడౌన్ తాళాన్ని తీసుకున్నాడు. స్టాక్‌ను డెలివలీ చేయాల్సి ఉందని నటించాడు. ఆ తర్వాత అతను అద్దెకు తీసుకున్న రెండు రిక్షాలలో దొంగిలించబడిన వస్తువులను లోడ్ చేసి, ఢిల్లీలోని ఐఎస్‌బీటీ, కశ్మీర్ గేట్ వద్దకు చేరుకుని రిక్షావాలాల సహాయంతో ఆ పేస్ట్‌లను ఓ ప్రైవేట్ బస్సులోకి బదిలీ చేసి తన స్వగ్రామానికి వెళ్లాడు. నిందితుడు దొంగిలించిన వస్తువులను స్థానిక గ్రామంలోని తన ఇంటి సమీపంలోని గదిలో ఉంచాడని, సులభంగా డబ్బు సంపాదించడానికి హోల్‌సేల్ లేదా రిటైల్ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేస్తున్నాడని, అయితే అతన్ని పోలీసు బృందం పట్టుకున్నట్లు వెల్లడించాడు.