Monkeypox: మంకీపాక్స్‌కు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox: మంకీపాక్స్ వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది. ఇకపై మంకీపాక్స్‌ను ‘ఎంపాక్స్’ అని పిలవాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది. మంకీపాక్స్ కొన్ని దశాబ్దాల నుంచి ఆఫ్రికాలో జనానికి సోకుతున్నప్పటికీ ఆ వ్యాధి పేరు విచక్షణారహితంగా, జాతి వివక్ష ధ్వనించేలా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇక నుంచి మంకీ పాక్స్ వ్యాధిని ఎంపాక్స్ అని వ్యవహరించాలని సోమవారం ప్రకటించింది. మరో ఏడాది పాటు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును వినియోగించారు.
Gujarat Elections: గుజరాత్ ఎన్నికలు.. 20 శాతం అభ్యర్థులు నేరచరితులే.. ఆప్‌దే అగ్రస్థానం
Also Read
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
ఈ ఏడాది మొదట్లో మంకీపాక్స్ వ్యాప్తి మొదలైనప్పుడు దీనిపై కొందరు ఆన్‌లైన్‌లో జాత్యహంకార, అసభ్య పదజాలంతో దూషించారు. అంతేగాక ఈ పేరుపై కొన్ని దేశాలు, వ్యక్తులు అభ్యంతరం తెలిపి ఆందోళన వ్యక్తం చేశారు. పేరు మార్చాలని ప్రతిపాదించారు. దీంతో నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ కొత్తపేరును ఖరారు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా ఏళ్ల తరవాత ఒక వ్యాధి పేరును మార్చడం ఇదే మొదటిసారి కావడం గమనార్గం. ఈ వ్యాధికి ఆంగ్లంలో కొత్త పదమైన ఎంపాక్స్(mpox)ను అనుసరించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసింది. అసాధారణంగా ఉన్న వ్యాధులకు పేర్లు కేటాయించడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ స్థానికంగా ఉన్న పశ్చిమ లేదా మధ్య ఆఫ్రికా కంటే యూరప్, ఉత్తర అమెరికాలోని దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయని తెలిసింది.
తాజావార్తలు
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!