Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి రిషి సునాక్ విదేశాంగ విధానంపై రిషి సునాక్ ప్రసంగించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చైనాతో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు. ఈ ఒప్పందం ఫలితంగా 2050నాటికి ప్రపంచవృద్ధిలో ఇండో-పసిఫిక్ వాటా 50శాతానికి చేరుతుందని తెలిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బ్రిటన్ విదేశీ విధానంపై మాట్లాడిన సునాక్.. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. స్వేచ్ఛా, పారదర్శకత వంటి బ్రిటిష్ విలువలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్- చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలవబడే సంబంధాలు ముగిశాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని, ఇది మరింత తీవ్రమవుతున్నాయని మండిపడ్డారు. చైనా నిరంకుశ పాలనపట్ల బ్రిటన్ దృక్పథాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయమిదని అన్నారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు. సామాజిక రాజకీయ సంస్కరణలకు దారితీస్తుందనే అమాయక ఆలోచనతో పాటు మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ కాలంలో స్వర్ణయుగంగా పిలవబడిన సంబంధాలు బ్రిటన్, చైనా మధ్య ముగిశాయని స్పష్టం చేస్తున్నానని రిషి సునాక్ అన్నారు. కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్‌ను చైనా పోలీసులు అరెస్ట్ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Hair Clump: బాలిక పొట్ట నిండా వెంట్రుకలే.. తన జుట్టును తానే ఆరగించింది..!
ప్రపంచ వ్యవహారాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి సునాక్ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌తోపాటు అనేక ఇతర దేశాలు కూడా దీనిని అర్థం చేసుకున్నాయని అన్నారు. అలాగే ఉక్రెయిన్‌కు గత ప్రధానులు బోరిస్, ట్రస్ అందించిన మద్దతును కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ మిత్రదేశాలతో వాణిజ్యం, భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రధాని రేసులో ఉన్న సమయంలో కూడా బ్రిటన్‌తోపాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందంటూ విమర్శలు రిషి సునాక్ గుప్పించారు. అమెరికా నుంచి భారత్ వరకు ఎన్నో దేశాలను చైనా లక్ష్యంగా చేసుకుందనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. బ్రిటన్ ప్రధానిగా తాను ఎన్నికైతే డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు. చైనా సాంకేతిక దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందిస్తానని తెలిపారు.