Rice Farming: సఫలమైన సరికొత్త వరి వంగడం.. ఒకసారి నాట్లు వేస్తే 8 పంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Farming: దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులు పెట్టుబడులు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వరి రైతులు కూలీల కొరత, కూలీ రేట్లు ఏటా పెంపు, ఇతర ఖర్చులతో తల్లడిల్లిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమస్యలను అధిగమించే దిశగా చైనా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఒకసారి వరి నాట్లు వేస్తే వరుసగా నాలుగేళ్ల పాటు, 8సీజన్లు పంట కోతకోస్తే ఎలా ఉంటుంది. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ దీనిని చైనా శాస్త్రవేత్తలు చేతల్లో చేసి నిరూపించారు. నిజమేనండి.. ఒకసారి వరి నాట్లు వేస్తే వరుసగా 8 సీజన్ల పాటు కోత కోసే విధంగా సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు. అంటే ఒక్కసారి నాటు వేస్తే చాలు.. 8సార్లు పంట చేతికి వస్తుందన్నమాట. కోత కోసిన తర్వాత నీరు పెడితే చాలు.. అవే పిలకలపై మరోసారి పైరు పెరుగుతుంది. ఈ కొత్త వంగడాన్ని చైనా శాస్త్రవేత్తలు సాగులోకి తెచ్చారు. ‘పీఆర్23’ పేరుతో పిలుస్తున్న ఈ వంగడాన్ని ఇప్పటికే దాదాపు 40 వేల ఎకరాల్లో చైనా రైతులు సాగుచేశారు. ఎకరానికి సగటున 27 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది.
సాధారణ పద్ధతితో పోలిస్తే ఈ కొత్త వంగడంతో 60 సాగునీటిని, 58శాతం కూలీల ఖర్చును ఆదా చేయొచ్చని పరిశోధకులు వెల్లడించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చేసే ఖర్చులో 49 శాతం వరకూ కలిసొస్తుందని చైనా పరిశోధనల్లో తేలింది. 2018లో అక్కడి రైతుల సాగుకు పీఆర్23 వంగడాన్ని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మరింతగా సాగుచేసి ప్రయోగాలు చేయాల్సి ఉంది. చైనా వృద్ధి చేసి ఆ వంగడాలు మనదేశంలో సాగు చేసేందుకు వీలవుతుందా లేదా అనేది పరిశీలించి చెప్పాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి దేశంలో వ్యవసాయ పరిశోధన సంస్థలను అడిగింది. రాజేంద్రనగర్‌లోని ‘భారత వరి పరిశోధన సంస్థ’ కూడా చైనా వంగడం సాగు విధానాలపై అధ్యయనం చేస్తోంది.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
Congress: కాంగ్రెస్ పార్టీ తొలి స్టీరింగ్ ప్యానెల్ సమావేశం.. ప్లీనరీ తేదీలు ఖరారు..!
సాధ్యాసాధ్యాల గురించి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ వివరించారు. మనదేశం సమశీతోష్ణ మండలంలో ఉందని.. ప్రతి 4నెలలకు ఒకసారి సీజన్ పూర్తిగా మారుతుందన్నారు. ఒకే నెలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా ఉండడంతో పాటు తెగుళ్లు చుట్టుముడుతున్నాయన్నారు. చైనా ఆహారపు అలవాట్లతో పాటు వాతావరణం మనదేశానికి భిన్నంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మన వాతావరణం, ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని కొత్త వంగడాల సాగుకు అనుమతి ఇవ్వాలన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!