IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జరుగుతున్న మొదటి వన్డేలో భారత టాపార్డర్ విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ 73 పరుగులతో రాణించడంతో ఇండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. భారత్‌ను 186 పరుగులకు ఆలౌట్ చేయడంలో షకీబ్ అల్ హసన్ ఐదు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9) నిరాశపర్చారు.
Team India: రిషబ్ పంత్‌కు ఉద్వాసన.. కెప్టెన్ రోహిత్ ఏం చెప్పాడంటే..?
ఆదివారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో షకీబ్ 36 పరుగులకు 5 వికెట్లు పడగొట్టగా, ఎబాడోత్ హొస్సేన్ కూడా 47 పరుగులకు 4 వికెట్లు సాధించాడు. హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది.ఈ మ్యాచ్‌లో కుల్దీప్ సేన్ భారత్‌లో అరంగేట్రం చేశాడు.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వి), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్