Viral Video: దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరుగుతున్న ఇంగ్లండ్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో రావల్పిండి పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారింది. చారిత్రక టెస్టుగా చెప్పుకుంటూ నిర్జీవమైన పిచ్‌ను ఏర్పాటు చేయడంపై పాకిస్థాన్ అభిమానులు సైతం పాక్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. కేవలం బ్యాటింగ్ మాత్రమే అనుకులించే పిచ్‌పై ఇరు దేశాల బ్యాటర్లు శతకాలతో రెచ్చిపోతున్నారు. మూడో రోజు కొనసాగుతున్న ఆటలో ఇప్పటికే 7 సెంచరీలు నమోదయ్యాయి. అందులు నాలుగు సెంచరీలు ఇంగ్లండ్ ఆటగాళ్లు బాదగా.. మూడు సెంచరీలు పాక్ బ్యాటర్లు కొట్టారు. దీంతో తొలి మ్యాచ్‌లో ఫలితం తేలదంటూ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌పై ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.
విమర్శల పాలవుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ కామెడీ పండించాడు. మూడో రోజు ఆటలో భాగంగా పాతబడుతున్న బంతిని మెరిపించేందుకు సరికొత్త పద్దతిని కనిపెట్టాడు. ఇంతవరకు ఎవరూ చేయని కొత్త ట్రిక్‌తో బంతిని మెరిపించే ప్రయత్నం చేశాడు రూట్. తన సహచర ఆటగాడు జాక్ లీచ్ బట్టతలపై బాల్‌ను రుద్ది.. నవ్వులు పూయించాడు. బౌలింగ్ మార్పు కోసం అందరు ఆటగాళ్లు ఒక చోట గుమ్మిగూడిన టైమ్‌లో జాక్ లీచ్ తనపై క్యాప్ తీసిన రూట్.. బాల్‌ను లీచ్ బట్టతలపై సుతిమెత్తగా తిప్పాడు. దీంతో బాల్‌కు అతని బట్టతలపై ఉన్న చెమట అంటింది. మళ్లీ దాన్ని హ్యాండ్ టవల్‌తో గట్టిగా రుద్దుతూ.. బంతిని మెరిపించేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాల్‌ను మెరిపించడానికి రూట్ కొత్త పద్ధతి కనిపెట్టాడంటూ పాక్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది.
Hacking: ఆస్పత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5 లక్షల మంది రోగుల డేటా ఆన్‌లైన్‌లో విక్రయం
కామెంటేటర్స్ ఉరూజ్ ముంతాజ్, డేవిడ్ గోవర్, నాసర్ హుస్సేన్‌లు.. జో రూట్ కనిపెట్టిన సరికొత్త పద్ధతిని చూసి ఆనందించారు. అది చూసి కాసేపు నవ్వుకున్నారు. “రూట్ లీచ్ తలపై బంతిని మెరుస్తున్నాడని నేను భావిస్తున్నాను” అని నాజర్ హుస్సేన్ అన్నాడు. ఒక క్షణం నవ్విన తర్వాత, హుస్సేన్ గోవర్ వైపు తిరిగి, “నా వైపు కూడా చూడకు” అని చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా.. గతంలో బ్యాట్‌ను చేత్తో పట్టుకోకుండా నిలువునా నిలబెట్టిన రూట్.. ఇప్పుడు గుండుపై బాల్ రుద్ది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. రావల్పిండిలోని పిచ్ పూర్తిగా ఫ్లాట్ డెక్ కావడంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 3వ రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 499 పరుగులు చేయగలిగింది, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 158 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఏడుగురు సెంచరీలు సాధించగా, తాజాగా బాబర్ ఆజం కూడా చేరాడు. బాల్‌ను తన బట్టతలపై రుద్దించుకున్న జాక్‌లీచ్ రెండు వికెట్లు పడగొట్టాడు. విల్ జాక్స్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయింది.
The new way to shine the ball 😅 #PAKvENG pic.twitter.com/YTdQaOrcEN
— ESPNcricinfo (@ESPNcricinfo) December 3, 2022