వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, చైనాతో భారత్ తన వ్యాపారాన్ని ఎందుకు ఆపడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రశ్నించారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ బుధవారం పార్లమెంట్‌కు తెలిపారు.
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఇవాళ ఉదయం 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులు కేసును ఛేదించినట్లు ద్వారక డీసీపీ ఎం.హర్షవర్ధన్ బుధవారం తెలిపారు.
యూజీసీ పీహెచ్‌డీ అడ్మిషన్ల నిబంధనలను మార్చేసింది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తిచేసిన వారికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పించేందుకు వీలుగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అడ్మిషన్ నిబంధనలను సవరించింది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను కొనసాగించవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ బుధవారం తెలిపారు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పఠాన్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రం 'పఠాన్' నుంచి కొత్త పాట 'బేషరమ్ రంగ్' తాజా వివాదానికి దారితీసింది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్లపై సైబర్ దాడికి పాల్పడింది చైనా హ్యాకర్లేనని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి. ప్రస్తుతం అందులోని డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలిపాయి. ఈ సైబర్ దాడి చైనా హ్యాకర్ల పనే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
దేశంలో ఏదో ఓ మూలన మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అటువంటి ఘటనలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హర్యానాలోని రేవారిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేస్తోంది. సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. 2016 నుంచి రాష్ట్రంలో మద్యం మరణాలపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నించిన బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. ‘