అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం ధృవీకరించిన ఒక రోజు అనంతరం.. అంతకుముందు జరిగిన ఘర్షణకు సంబంధించిన తేదీ లేని వీడియో వైరల్‌గా మారింది.
సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ ప్రతిభా సింగ్ హాజరయ్యారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప ది రైజ్' గతేడాది ప్రేక్షకుల ముందుకు భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
భోజనంలో తల వెంట్రుక వచ్చిందని ఓ భర్త కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు.
గూగుల్ జీమెయిల్ సర్వీసులకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో అంతరాయం ఏర్పడింది. జీమెయిల్ సర్వీసులు పనిచేయడం లేదని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మలేరియా నివారణ చర్యలకు ఆటంకం కలిగిందని.. దీంతో మలేరియా కేసులు, మరణాలు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ‘వరల్డ్ మలేరియా రిపోర్ట్-2022’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం విడుదల చేసింది.
చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యునిసెఫ్‌తో కలిసి జువెనైల్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కమిటీ నిర్వహించిన పోక్సో చట్టంపై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ప్రసంగించారు.