Crime News: దేశంలో ఏదో ఓ మూలన మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అటువంటి ఘటనలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హర్యానాలోని రేవారిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ-జైపూర్ హైవేపై కసోలా ఫ్లైఓవర్ సమీపంలోని పొలంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులు ఇవాళ వెల్లడించారు. ఆ మహిళ చనిపోయి పది రోజులు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ రైతు తన పొలంలో ఓ ట్రాలీ బ్యాగ్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ శరీర అవయవాలను గుర్తించి తమకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనల్వాస్ గ్రామానికి చెందిన రైతు రాంపాల్ రాత్రి సమయంలో తన పొలానికి వెళ్లినప్పుడు పొదల్లో నల్లటి ట్రాలీ బ్యాగ్, చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయి. ఆ ట్రాలీ బ్యాగ్ తెరిచి చూడగా అందులో కుళ్లిపోయిన శరీర భాగాలు ఉన్నాయి. దీంతో అతను ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ఆ శరీర భాగాలు ఎవరివో కూడా గుర్తించే పరిస్థితి లేకుండా మృతదేహం కుళ్లి పోయింది. దీంతో ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ చేరుకుని ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. హత్య జరిగి దాదాపు 10 రోజులు అయి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ మృతదేహం ఎవరిదనే కోణంలో విచారణ చేపట్టారు. ఎవరో మహిళను హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆమె మృతదేహాన్ని పారేసినట్లు అనిపించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
India-China Clash: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న సరిహద్దు ఘర్షణలు.. విపక్షాలు వాకౌట్
ఘటనాస్థలంలోని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మంగళవారం అర్థరాత్రి కసోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో నిందితులను పట్టుకుంటామని కసోలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో మనోజ్ కడియాన్ తెలిపారు.