Pathaan Issue: ఆ సీన్లు తొలగిస్తారా.. సినిమాను తొలగించాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathaan Issue: షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పఠాన్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రం ‘పఠాన్’ నుంచి కొత్త పాట ‘బేషరమ్ రంగ్’ తాజా వివాదానికి దారితీసింది. విడుదలైనప్పటి నుంచి టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ఓ పాట ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఆ పాటే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ చిత్రం నుంచి రిలీజైన బేషరమ్ రంగ్ సాంగ్‌లో దీపికా ధరించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంతరంతో పాటు అశ్లీలం మోతాదు మించిందని పఠాన్ మూవీని బ్యాన్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పాటపై తన అభ్యంతరాలను స్పష్టం చేశారు.
Prabhas: బాలకృష్ణ – ప్రభాస్ జోడీ క్రేజ్ కు అదే కారణమా!?
Also Read
ఈ సినిమాపై నిషేధం విధించాలని తాజాగా మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా కోరారు. ఈ మూవీలో కాషాయ దుస్తులను వాడటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్లు ఉన్నాయని, ఈ సీన్లను మార్చనిపక్షంలో మధ్యప్రదేశ్‌లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామని హెచ్చరించారు.సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న కాస్ట్యూ్‌మ్స్‌ను, సీన్లను మార్చకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరికలు చేశారు. కుమార్ సాహిత్యంతో విశాల్-శేఖర్ కంపోజ్ చేసిన ఈ పాట షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే మధ్య సిజ్లింగ్ కెమిస్ట్రీని ప్రదర్శిస్తుంది. దీనిపై సినీ బృందం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఇక వచ్చే ఏడాది జనవరి 25న పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
फिल्म #Pathan के गाने में टुकड़े-टुकड़े गैंग की समर्थक अभिनेत्री दीपिका पादुकोण की
वेशभूषा बेहद आपत्तिजनक है और गाना दूषित मानसिकता के साथ फिल्माया गया है।
गाने के दृश्यों व वेशभूषा को ठीक किया जाए अन्यथा फिल्म को मध्यप्रदेश में अनुमति दी जाए या नहीं दी जाए,यह विचारणीय होगा। pic.twitter.com/Ekl20ClY75— NAROTAM MISHRRA (@drnarottammisra) December 14, 2022
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!