Tragedy: దుబాయ్‌లోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఐదేళ్ల భారతీయ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంవత్సరం అలాంటి ఘటనల్లో ఇది మూడోది అని ఓ నివేదిక వెల్లడించింది. డిసెంబరు 10న దుబాయ్‌లోని దీరా జిల్లాలో 9వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లోని కిటికీలోంచి చిన్నారి పడిపోవడంతో ఈ ఘటన జరిగిందని ఖలీజ్ టైమ్స్ వార్తాపత్రిక డిసెంబర్ 11న నివేదించింది. యూఏఈలో అధికారిక డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత చివరి కర్మల కోసం చిన్నారి మృతదేహాన్ని తిరిగి భారతదేశానికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు, విషాదంలో చిక్కుకున్న కుటుంబం వివరాలు మాత్రం తెలియరాలేదు.
Acid Attack: దేశరాజధానిలో మైనర్‌పై యాసిడ్ దాడి.. నిందితులు అరెస్ట్
ఇది ఎలా జరిగిందో తమకు కచ్చితంగా తెలియదని.. కానీ హృదయ విదారక ఘటన అని పొరుగువారు వెల్లడించారు. ఆ బాలిక ఎప్పుడూ నవ్వుతూ ఉండే చురుకైన అమ్మాయి అని చెప్పారు. గత నెలలో, ఆసియా సంతతికి చెందిన మూడేళ్ల చిన్నారి షార్జాలో భవనం 14వ అంతస్తు నుంచి పడి చనిపోగా, ఫిబ్రవరిలో 10 ఏళ్ల ఆసియా చిన్నారి షార్జాలోని రెసిడెన్షియల్ టవర్ 32వ అంతస్తు నుంచి పడి మృతి చెందింది.