ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ సర్కారు వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు.
తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ అమీన్ పూనావాలా బెయిల్ కోరుతూ శుక్రవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అతని న్యాయవాది వెల్లడించారు.
ఛట్టోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
గడప గడపకు కార్యక్రమం అంటే ప్రజల దగ్గరకు వెళ్లడమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మూడేళ్లలో ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
విశాఖ సాగర తీరంలో తూర్పు నౌకాదళం ఘనంగా విజయ్ దివస్‌ను నిర్వహించింది. భారత సైన్యం ప్రాణాలకు తెగించిం 1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయ్ దివస్‌ను జరుపుకోవడం ఆనవాయితీ.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ పరీక్ష 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2023 కోసం రిజిస్ట్రేషన్ డిసెంబర్ 15, 2022న ప్రారంభమవుతుంది. జనవరి 12, 2023న ముగుస్తుంది.
హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కాగితాలు ఏరుకునే తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తరచుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి యజమాని ఇంట్లో అద్దెకు ఉండే పీహెచ్‌డీ విద్యార్థిని దారుణం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.
5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని భారత్ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ఎంతో ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు వెల్లడించాయి.