సుఖ్వీందర్ సింగ్‌ది మొదట్లో సాధారణ జీవనమే. ఆయన తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేశారు. సుఖు కూడా ఒకప్పుడు పాలు విక్రయించారు. పాలు విక్రయించిన సుఖ్వీందర్.. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలేలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి చంద్రకాంత్ పాటిల్ శనివారం పుణె జిల్లాలోని పింప్రీ చించ్‌వాడ్ నగరంలో ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు.
శనివారం దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బీ-737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకోగా.. కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని, ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ విచారణ జరుపుతోందని సీనియర్ అధికారి తెలిపారు.
వాయుగుండంగా కొనసాగుతోంది మాండూస్ తుఫాన్. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
అస్సాంలోని నార్త్ గౌహతి ప్రాంతంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెసిడెన్షియల్ క్వార్టర్‌లో ఐఐటీ గౌహతి ప్రొఫెసర్ ఒకరు శవమై కనిపించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
గుజరాత్ శాసన సభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ముస్లిం యువతుల వివాహానికి కనీస వయస్సును ఇతర మతాలకు చెందిన వారితో సమానంగా చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా కేంద్రం స్పందించాలని కోరింది.
హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిమాచల్‌లో 68 సీట్లలో 40 గెలిచిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.
గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన ఇమ్రాన్ ఖేదావాలా 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ముస్లిం అభ్యర్థి.