ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న సొరంగమార్గంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో దాదాపు 19 మంది మరణించగా.. 32 మంది గాయపడినట్లు స్థానిక అధికారి ఆదివారం తెలిపారు. కాబూల్‌కు ఉత్తరాన 129 కిలోమీటర్లు (80 మైళ్లు) దూరంలో ఉన్న సలాంగ్ టన్నెల్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. టైటిల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను పోలిన వ్యక్తి కనిపించాడు.
భారతదేశానికి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022గా గెలిచి 21 సంవత్సరాల తర్వాత తిరిగి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. లాస్ వెగాస్‌లో జరిగిన గాలా ఈవెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్గమ్ కౌశల్ ఈ రోజు మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందారు.
ఓ డ్రైవర్ కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని బాగ్‌లోని లీలావతి స్కూల్ సమీపంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది.
కిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడిలో నలుగురు పాకిస్తాన్ పోలీసులు మరణించారు. చాలా మంది ఈ దాడిలో గాయపడ్డారు.
నటుడు కమల్ హాసన్ డిసెంబర్ 24న జరగనున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు వచ్చే వారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో చేరనున్నారు. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ప్రకారం సూపర్ స్టార్‌ను యాత్రలో పాల్గొనమని రాహుల్ గాంధీ ఆహ్వానించారు.
భారతదేశంలో ఎవరినైనా ప్రేమించడం, కులాంతర వివాహం చేసుకోవడం, వారి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం వల్లే వందలాది మంది యువకులు పరువు హత్యల కారణంగా మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
మేఘాలయలోని షిల్లాంగ్ జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ఎనిమిదేళ్ల ఈశాన్య భారత్‌లో అభివృద్ధికి అడ్డుగా నిలిచిన అవినీతి, అశాంతి, రాజకీయ అనుకూలత వంటి అన్ని అడ్డంకులకు తమ ప్రభుత్వం రెడ్ కార్డ్ ఇచ్చిందన్నారు.
గుజరాత్ కసాయి ప్రధాని మోదీ అంటూ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉగ్రవాదానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన తట్టుకోలేక ఈ వ్యాఖ్యలు చేశారు.