2023 అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే ఈ టోర్నీ నిర్వహణపై ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023కి భారత్ ఆతిథ్యమవ్వనున్న నేపథ్యంలో.. వరల్డ్ కప్ భారత్ నుంచి తరలిపోతుందనే వార్త టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల జాతీయ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు.
గరీభీ హఠావో అనే నినాదాలతో పేదరికం దూరం కాదని.. నిరంతర శ్రమ, ఆలోచనలు, ఆవిష్కరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి అన్నారు.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్ వేడుకల్లో బిగ్‌బాస్ ఫేం హిమజ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన చిన్నతనంలో క్రిస్మస్ వేడుకల జ్ఞాపకాల గురించి పంచుకున్నారు.
పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. జూలకంటి బ్రహ్మారెడ్డి సహా తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
వరుస సినిమాలను నిర్మిస్తున్న 'జీఏ 2 పిక్చర్స్', ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ '18 పేజెస్'. 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న మరో చిత్రం ఇది కావడం గమనార్హం.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖును ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంగా ఎన్నికైన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 272 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది.