ICC-India: భారత్‌కు బిగ్ షాక్.. ఇకపై ఐసీసీ టోర్నీలు ఇండియాలో లేనట్టే?
- క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే వార్త
- భవిష్యత్ టోర్నీల నిర్వహణపై ఐసీసీ ఆలోచనలు
- ఐసీసీ టోర్నీలు ఇండియాలో లేనట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC May Shift 2029 Champions Trophy and 2031 World Cup from India: క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ టోర్నీల నిర్వహణపై కీలక ఆలోచనలు చేస్తోందని సమాచారం. ముఖ్యంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2029, వన్డే ప్రపంచ కప్ 2031 ఆతిథ్య హక్కులను భారత్‌కు ఇవ్వకుండా.. వేరే దేశానికి మార్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాకు ఐసీసీ టోర్నీలు తరలి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలే ఐసీసీ నిర్ణయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడం వల్ల ఐసీసీ మెగా టోర్నీల నిర్వహణలో లాజిస్టిక్, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ టోర్నీలను ఆస్ట్రేలియాకు తరలించే అంశాన్ని ఐసీసీ అంతర్గతంగా చర్చిస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక పేర్కొంది.
Also Read
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ఆస్ట్రేలియాకు ఐసీసీ టోర్నీలు నిర్వహించిన అనుభవం ఉండటంతో పాటు మౌలిక వసతులు, స్టేడియాలు, భద్రతా ఏర్పాట్లు ఉండటం కూడా కీలక కారణాలుగా చెప్పబడుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయినప్పటికీ ఈ వార్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే.. భారత్‌కు భారీ షాక్ అనే చెప్పాలి. ఆదాయంతో పాటు పేరు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అయితే భవిష్యత్‌లో పరిస్థితులు మారితే ఐసీసీ తుది నిర్ణయం మారే అవకాశమూ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!