Bilawal Bhutto Row: గుజరాత్ కసాయి ప్రధాని మోదీ అంటూ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉగ్రవాదానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన తట్టుకోలేక ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పాక్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. ఈ సందర్భంగా యూపీలో జరిగిన నిరసన సభలో ఓ బీజేపీ నాయకుడు విచిత్ర ప్రకటన చేశారు. పాక్ విదేశాంగ మంత్రి భుట్టో తల తీసుకొస్తే రూ.2కోట్ల రివార్డు ఇస్తానని ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత మనుపాల్ భన్సల్ ప్రకటించారు.
బాగపత్ జిల్లా పంచాయత్‌కు చెందిన మనుపాల్ భన్సల్ భుట్టో వ్యాఖ్యలకు చేపట్టిన నిరసనలో ఈ ప్రకటన చేశారు. భన్సల్ ఈ ప్రకటన చేయగానే అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా ‘మనుపాల్ భన్సల్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్లు స్పష్టం చేశారు. మనం ఎంతో గౌరవించే ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఆయన అన్నారు. ప్రధానిపై తమకు విపరీతమైన గౌరవం ఉందన్నారు. ఆయన కోసం ఎలాంటి పనైనా చేస్తామని మనుపాల్ భన్సల్ వ్యాఖ్యానించారు.
Graves at Home: ఇదెక్కడి ఖర్మరా నాయనా.. కళలో బాబా చెప్పాడని ఇంట్లో మూడు సమాధులా!
ప్రధాని మోదీని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేసింది. కోల్‌కతా, రాంచీ, పుణె, దిల్లీ, గోరఖ్‌పూర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. పుణెలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… దాయాది దేశం జాతీయ జెండాలను దహనం చేశారు. ఈ ఆందోళనల్లో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.