అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం(మిల్లెట్ ఇయర్) 2023ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఏర్పాటు చేసిన లంచ్‌లో తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆనందించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారత ప్రభుత్వం జనాభా గణనలో షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది.
కింగ్ చార్లెస్ III చిత్రాన్ని కలిగి ఉన్న కరెన్సీ నోట్లు 2024 మధ్య నాటికి చెలామణిలోకి రానున్నాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మంగళవారం వాటి డిజైన్లను ఆవిష్కరించింది. 5, 10, 20, 50 పౌండ్ల పాలిమర్ నోట్లపై డిజైన్‌పై కింగ్ చార్లెస్ ఫోటోను ముద్రించనున్నారు.
కరోనా నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. చైనా పెరుగుతున్న కేసులు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసిన తర్వాత కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్కడ రోజువారీ కేసులు, మరణాలు విపరీతంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఆయనవి అభ్యంతరకర వ్యాఖ్యలని, క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ క్షమాపణ చెప్పేందుకు ఖర్గే ఖరాకండిగా ససేమిరా అన్నారు.
సిరిసిల్ల యువతి శాలిని కిడ్నాప్ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆ యువతి వీడియోను విడుదల చేసింది. నాలుగేళ్లుగా జానీని ప్రేమిస్తున్నట్లు ఆ యువతి వెల్లడించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామ యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను జ్యోతి కిడ్నాప్ విషయంపై వివరాలు కేటీఆర్ అడిగారు.
వియత్నాంలోని కాన్‌థో నగరంలో ఇటీవల నిర్మించిన బంగారు భవనం అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది. ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బడిముబ్బడిగా సంపాదించాడు.
భారత్ - చైనాల సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ నేషనల్ కౌన్సిల్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఓవైపు చైనా మనపై దాడికి దిగుతుంటే.. వారి ఉత్పత్తులను గణనీయంగా దిగుమతి ఎందుకు చేసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.