తమిళనాడు బీజేపీ నేత గాయత్రి రఘురామ్ మహిళల పట్ల గౌరవం లేదంటూ ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. మరో బీజేపీ నాయకుడి ఆడియో లీక్ ఘటనతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.
ఆదిశంకరాచార్యపై కేరళ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందూ వైదిక తత్వవేత్త ఆదిశంకరాచార్య క్రూరమైన కుల వ్యవస్థకు చెందిన న్యాయవాది, ప్రతినిధి అంటూ కేరళ మంత్రి, కమ్యూనిస్ట్ నాయకుడు ఎంబీ రాజేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' తొమ్మిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నేడు పునఃప్రారంభం కానుంది. 110 రోజులకు పైగా సాగిన యాత్రలో ఇప్పటివరకు 3వేల కిలోమీటర్లకు చేరుకుంది.
పాండిత్య ప్రసంగాలు, శక్తివంతమైన వక్తృత్వానికి పేరుగాంచిన కర్ణాటకలోని జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి సోమవారం కన్నుమూశారు. 81 ఏళ్ల పీఠాధిపతి గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టి ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమెంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించగా.. అన్ని చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మెక్సికోలోని ఓ జైలులో కాల్పులు కలకలం రేపాయి. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. మెక్సికోలోని సియుడాడ్ జుయారెజ్‌లోని జైలుపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఏకాదశి సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆయన నాలుగు రోజుల క్రితం కందుకూరులో రోడ్ షో నిర్వహించగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే ఇవాళ చంద్రబాబు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో వస్త్రాల పంపిణీకి నిర్వహించిన బహిరంగసభలో మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం జగన్ నుంచి పిలుపొచ్చింది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రితో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి భేటీ కానున్నారు. ఇటీవల అధికారుల తీరుపై కోటంరెడ్డి ఘాటైన విమర్శలు చేస్తున్నారు.