తన పేరు, ఫోన్ నంబర్‌ను ప్రస్తావిస్తూ.. తనతో శృంగారం చేయాలనే కోరిక ఉంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలంటూ పలువురికి చిట్టీలు విసిరిన ఓ కళాశాల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది.
హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తామని చండీగఢ్ పోలీసులు శనివారం తెలిపారు. రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గురువారం ఈ ఆరోపణ చేయగా, ఒక రోజు తర్వాత ఆమె ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది.
గత 40 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన మహిళను ఉన్నత పదవికి ఎన్నుకోవడం ద్వారా బీహార్‌లోని గయాలో జరిగిన పౌర సంస్థల ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గయా డిప్యూటీ మేయర్‌గా చింతాదేవి ఎన్నికయ్యారు.
ఉక్రెయిన్‌పై భీకరంగా దాడులు చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశ పౌరులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన చట్టసభ సభ్యుడు, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్, అతని సన్నిహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్‌లు ఇద్దరూ కూడా రెండ్రోజుల వ్యవధిలో రాయగడ జిల్లాలోని ఒక హోటల్‌లో రక్తపు మడుగులో పడి కనిపించటం కలకలం రేపింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ( ఎన్‌ఐఏ) 2022లో 73 కేసులను నమోదు చేసింది. ఇది 2021లో 61 కేసులు నమోదు కాగా.. 2022లో 19.67 శాతం పెరిగి 73 కేసులు నమోదయ్యాయి. ఇది ఎన్‌ఐఏకు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది.
పంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. అందరికంటే ముందే న్యూజిలాండ్ ఆక్లాండ్ వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మధుర జ్ఞాపకాలను మదిలో దాచుకుంటూ 2022కి గుడ్‌బై చెప్పిన ఆక్లాండ్ వాసులు.. కోటి ఆశలతో ప్రపంచంలోనే అందరికంటే ముందే 2023కి స్వాగతం పలికారు.
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.
అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తే సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసిటేషన్) చేస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో నిందితుడు షీజన్‌ఖాన్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపబడ్డాడు. కస్టడీలో ఉన్న నిందితుడు ఇంట్లో వండిన భోజనంతో పాటు మందులు, కుటుంబ సభ్యులను కలవాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో 2023లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఎన్నికలకు ముందు కేఎస్ ఈశ్వరప్ప, రమేష్ జార్కిహోళి వంటి అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు.